Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్ (JK) లోని ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో

Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..
Encounter

Updated on: Jan 30, 2022 | 5:00 PM

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్ (JK) లోని ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ల (Encounter) లో జైషే మహ్మద్ కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుల్లో జైషే మహ్మద్ కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. కాశ్మీర్‎లోని బుడ్గాం (Budgam) జిల్లాలోని చ్రార్-ఎ-షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. దీంతోపాటు పుల్వామా (Pulwama) జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‎కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు AK-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులకు పెద్ద విజయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. గడిచిన నెలరోజుల్లో 12కు పైగా జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 22 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకొని.. విడాకులిచ్చాడు.. చివరకు కోపంతో మాజీ భార్యపై..

Love Story: కొడుకు చేసిన పనికి దారుణ హత్యకు గురైన తల్లి.. ఇంతకీ అతనేం చేశాడంటే..

 

Follow Us