Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి

|

Feb 12, 2021 | 1:47 PM

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లో చిన్నారితో సహా..

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి
Follow us on

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లో చిన్నారితో సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం సమయంలో సోలాపూర్ జిల్లాలోని సంగోలా-పంధర్‌పూర్‌ మార్గంలో కాసేగావ్‌ గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. మృతులను కొల్హాపూర్‌ జిల్లాలోని చంద్‌ఘడ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు పంధర్పూర్‌లో దైవదర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read:

నకిలీ వార్తల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ట్విట్టర్‌, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ

Covid Vaccine: 50 ఏళ్ల పైబడిన 27 కోట్ల మందికి కరోనా టీకాలు.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని మోదీ