Road Accident: శుభకార్యానికి హాజరై వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. 13 మందికి..

|

May 21, 2022 | 1:56 PM

వేగంగా వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: శుభకార్యానికి హాజరై వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. 13 మందికి..
Karnataka Road Accident
Follow us on

Karnataka Road Accident: వారంతా శుభకార్యానికి హాజరై ఇళ్లకు వస్తున్నారు.. మరి కాసేపట్లో ఇళ్లకు చేరుతారనగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ధార్వాడ్‌ జిల్లాలోని నిగడి ప్రాంతంలోని బెంకన్‌కట్టికి వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో 13 గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

ప్రమాద సమయంలో వ్యాన్‌లో 21 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ధార్వాడ్ రూరల్ పోలీసులు తెలిపారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మృతులను అనన్య (14), హరీష్ (13), శిల్పా (34), నీలవ్వ (60), మదుశ్రీ (20), మహేశ్వర్‌ (11), శంబులింగయ్య (35)గా గుర్తించారు. మృతులంతా ధార్వాడ తాలూకా బెనకట్టి గ్రామానికి చెందిన వారిగా తెలిపారు. శుక్రవారం రాత్రి మన్సూర్‌ గ్రామంలో జరిగిన నిశ్చితార్థవేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..