Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారం.. చివరకు ఏమైందంటే..!

Nizamabad: దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మానవత్వం మంటగలుస్తోంది. తండ్రులు కన్న కూతుర్లపైనే కామాంధులుగా మారుతున్నారు. కొందరు తండ్రుల..

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారం.. చివరకు ఏమైందంటే..!
Crime News

Updated on: Sep 03, 2022 | 6:05 PM

Nizamabad: దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మానవత్వం మంటగలుస్తోంది. తండ్రులు కన్న కూతుర్లపైనే కామాంధులుగా మారుతున్నారు. కొందరు తండ్రుల ప్రవర్తనతో సమాజం తలదించుకునేలా తయారవుతోంది. తాజాగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కొద్ది రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి కూతురిని అడగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కన్న కూతురుపైనే ఇలాంటి దారుణానికి పాల్పడటం క్షమించరాని నేరమని, కఠినంగా శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి