ఎన్నిసార్లు టై అయినా..విజయం తేలేవరకు సూపర్ ఓవర్లే!

ఇటీవల జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ను బౌండరీ లెక్కతో విజేతగా తేల్చడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తుదిపోరు టై గా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌ను నిర్ణయించారు. సూపర్ ఓవర్‌ కూడా టై కావడంతో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. దీనిపై క్రికెట్ అభిమానులతో పాటు పలువు మాజీ […]

ఎన్నిసార్లు టై అయినా..విజయం తేలేవరకు సూపర్ ఓవర్లే!
Follow us

|

Updated on: Sep 24, 2019 | 7:46 PM

ఇటీవల జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ను బౌండరీ లెక్కతో విజేతగా తేల్చడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తుదిపోరు టై గా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌ను నిర్ణయించారు. సూపర్ ఓవర్‌ కూడా టై కావడంతో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. దీనిపై క్రికెట్ అభిమానులతో పాటు పలువు మాజీ క్రికెటర్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాత చింతకాయపచ్చడి రూల్స్‌ని మార్చి కొత్తగా నియమ, నిబంధనలు అమలు చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అయితే సూపర్‌ ఓవర్‌లోనూ స్కోరు సమమైతే విజేత తేలేవరకు అనేక సూపర్‌ ఓవర్లు ఆడించే పద్ధతిని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవేశపెట్టనుంది. ఆసీస్‌లో జరగనున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఈ పద్ధతిని ప్రయోగించనున్నారు.

బిగ్‌బాష్‌ లీగ్, ఉమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగుల్లో కొత్త నిబంధనల ప్రకారం ఫైనల్లో, సూపర్ ఓవర్‌లోనూ స్కోరు సమం అయితే స్పష్టమైన మెజారిటీ వచ్చే వరకు మరో సూపర్‌ ఓవర్‌ను ఆడించాలి. ‘ప్రపంచకప్ ఫైనల్‌ తర్వాత సూపర్‌ఓవర్ నిబంధనలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఉమెన్స్‌ బిగ్‌బాష్ లీగ్‌ సెమీఫైనల్‌ సిడ్నీ సిక్సర్స్‌ వెర్సెస్ మెల్‌బోర్న్‌ రెనెగెడెస్ మ్యాచ్‌తో జట్లు అభిప్రాయాలు, అభిమానుల ఆలోచనలు మాకు అర్థమయ్యాయి. పురుషుల, మహిళల బిగ్‌బాష్‌ లీగుల్లో మల్టిపుల్‌ సూపర్‌ ఓవర్స్‌ అభిమానులను అలరిస్తాయని ఆశిస్తున్నాం. ఉత్కంఠ భరితంగా సాగే నాకౌట్‌ మ్యాచ్‌లను విజయవంతంగా ముగించే బలమైన వ్యవస్థ మావద్ద ఉంది’ అని బిగ్‌బాష్‌ లీగ్‌ ప్రధానాధికారి అలిస్టెయిర్‌ డాబ్సన్ తెలిపారు. మల్టిపుల్ సూపర్ ఓవర్లను ఆడించడంలో కాల పరిమితులు, బ్రాడ్‌కాస్ట్‌, మైదాన సంబంధిత ఇబ్బందులు తలెత్తితే ఉన్నత స్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోనే టీ20 ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో