Corona Vaccination: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించారో వెల్లడించిన కేంద్రం

Corona Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టిన ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ఆరో రోజు కొనసాగింది....

Corona Vaccination: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించారో వెల్లడించిన కేంద్రం
Covid-19 vaccination
Follow us

|

Updated on: Jan 21, 2021 | 9:56 PM

Corona Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టిన ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ఆరో రోజు కొనసాగింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 9,99,065 మందికి టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోజు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిన ప్రాంతాల్లో చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 1,92,581 మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నాని వెల్లడించారు. అయితే గురువారం టీకా వేయించుకున్నవారిలో తెలంగాణ నుంచి 26,441 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 15,507 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్‌ టీకాలు ఎంతో సురక్షితం, సమర్థవంతమైనవన్నారు. ఎవరు కూడా వీటిపై అసత్యాలను , వందతులను నమ్మవద్దని సూచించారు. కరోనా మహమ్మారి కట్టడిలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అలాగే జనవరి 16న దేశ వ్యాప్తంగా కోవిడ్‌ టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కరోనాపై పోరులో ముందుండి పని చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పోలీసులకు తొలి ప్రాధాన్యతగా టీకాలు అందించారు. రెండో విడతలో ప్రధాన మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీకా అందించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

కరోనాకు చెక్ పెట్టిన ఆక్సఫర్డ్ శాస్త్రవేత్తలు.. మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం.. స్ట్రెయిన్ వైరస్ అంతానికి ప్రయోగాలు..!

సీరమ్ ఇన్‌స్టిట్యుట్ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి.. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన సంస్థ సీఈవో

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో