Zika Virus: రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ.. ఆందోళన చెందవద్దని ఆరోగ్య మంత్రి సలహా..

|

Dec 12, 2022 | 9:31 PM

జికా వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ప్రజలు దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వైరస్ వ్యాప్తి పట్ల మార్గదర్శకాన్ని జారీ చేశారు. అదేవిధంగా తీవ్రమైన వాతావరణం, తుఫానుల ప్రభావానికి రాబోయే మూడు నెలల్లో..

Zika Virus: రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ.. ఆందోళన చెందవద్దని ఆరోగ్య మంత్రి సలహా..
Zika Virus
Follow us on

కరోనా మహమ్మారి కోరల్లోంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా, కొత్తగా జికా వైరస్‌ జడలు విప్పుకుంటోంది. దేశంలో జికా వైరస్‌ ఆందోళన మొదలైంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జికా వైరస్‌ తొలి కేసు నమోదైంది. రాయచూరుకు చెందిన ఐదేళ్ల బాలికకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇదే తొలి జికా కేసు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య వెల్లడించింది.. ఆరోగ్య శాఖ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఆరోగ్య సౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి జికా వైరస్‌ను గుర్తించినట్లు పుణె ల్యాబ్‌ నుంచి నివేదిక అందిందని తెలిపారు. డిసెంబర్ 5న నమూనా సేకరించామని, ల్యాబ్ 8వ తేదీన నివేదిక అందినట్టుగా చెప్పారు. మూడు నమూనాలను పంపాగా, వాటిలో రెండు నెగెటివ్‌, ఒకటి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.

బాలికకు జికా వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున నిఘా ఉంచామని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో జికా కనిపించింది. ఇప్పుడు మా మొదటి కేసు ఉంది. డెంగ్యూ, చికెన్ గూన్యా పరీక్షలకు గురైన శాంపిల్‌ను పూణేకు పంపించారు. అక్కడి ల్యాబ్‌లో జికా పాజిటివ్‌గా వచ్చిందని, జాగ్రత్తగా ఉండాలని రాయచూరుతో పాటు పొరుగు జిల్లాలకు సూచించారు. ఈ రకమైన ఇన్ఫెక్షన్ కనుగొనబడితే, పరీక్ష కోసం నమూనాను పంపాలని సూచించారు. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గమనిస్తోందన్నారు.

జికా వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ప్రజలు దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వైరస్ వ్యాప్తి పట్ల మార్గదర్శకాన్ని జారీ చేశారు. అదేవిధంగా తీవ్రమైన వాతావరణం, తుఫానుల ప్రభావానికి రాబోయే మూడు నెలల్లో ఏం చేయాలి. వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలా జాగ్రత్తగా ఉండాలో మార్గదర్శకాల్లో తెలియజేస్తామని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి