భయాన్ని పోగొడితేనే కరోనాతో సమర్థంగా పోరాడగలం..!

| Edited By:

May 10, 2020 | 6:15 PM

కరోనా మహమ్మారిపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూనే భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని అలా చేస్తేనే వైరస్‌తో సమర్థంగా పోరాడగలమని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

భయాన్ని పోగొడితేనే కరోనాతో సమర్థంగా పోరాడగలం..!
Follow us on

కరోనా మహమ్మారిపై ప్రజల్లో భయాన్ని పోగొడుతూనే భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని అలా చేస్తేనే వైరస్‌తో సమర్థంగా పోరాడగలమని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్ తరువాత అనుసరించాల్సిన హెల్త్ ప్రొటోకాల్‌పై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సోమవారం నుంచి ఏపీకి రాబోతున్న వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి వైద్య వివరాలను ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, హెల్త్‌ అసిస్టెంట్‌కు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వారికి పరీక్షలు చేసి ఆ తరువాత వారిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని సూచనలు చేశారు. వీటన్నింటికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమీక్షలో విదేశాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన వారు సోమవారంనుంచి స్వదేశానికి తిరిగి వస్తారని.. వారు 11 చెక్‌పోస్ట్‌ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అవకాశాలున్నాయని అధికారులు జగన్‌కు వివరించారు. అమెరికా నుంచి వచ్చే వారు ముంబయి, హైదరాబాద్‌, చెన్నై విమానాశ్రయాలకు చేరుకుంటారని.. వారిని విశాఖ, తిరుపతి, విజయవాడలోనిక్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని జగన్‌కు తెలిపారు. రాష్ట్రంలోకి రాబోతున్న వారి కోసం అన్ని ఏర్పాట్లను చేసినట్లు అధికారులు తెలిపారు.

Read This Story Also: వారి వివరాలు చెప్పండి.. 500 క్యాష్‌ సొంతం చేసుకోండి..!