జగన్ నివాసం ఆ జోన్‌లో లేదు.. గుంటూరు కలెక్టర్ క్లారిటీ..!

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ నివాసం హాట్‌స్పాట్‌లో ఉందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది.

జగన్ నివాసం ఆ జోన్‌లో లేదు.. గుంటూరు కలెక్టర్ క్లారిటీ..!

Edited By:

Updated on: Apr 18, 2020 | 7:05 PM

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ నివాసం హాట్‌స్పాట్‌లో ఉందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. తాడేపల్లి పాత గేట్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఇటీవల ఓ వృద్ధురాలు మరణించింది. చనిపోయిన తరువాత ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటవ్‌గా తేలింది. ఆమె నివాసం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో ఉండగా.. సీఎం నివాసం రెడ్‌జోన్‌లో ఉందనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ స్పందించారు. జగన్ నివాసం హాట్‌స్పాట్ జోన్‌లో లేదని క్లారిటీ ఇచ్చేశారు. నాలుగు పాజిటివ్‌ కేసులున్న ప్రాంతం మాత్రమే హాట్‌స్పాట్‌లోకి వస్తుందని ఆయన తెలిపారు. తాడేపల్లిలో ఒక్క కేసు మాత్రమే ఉన్నందున అది హాట్‌స్పాట్ పరిధిలోకి రాదని వివరణ ఇచ్చారు. కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కు చేరిన విషయం తెలిసిందే.

Read This Story Also: మీకు సెల్యూట్‌ అమ్మా: తుని మహిళపై ఏపీ డీజీపీ ప్రశంసలు