Yadadri Temple: యాదాద్రి దేవస్థానం కీలక నిర్ణయం.. బుధవారం నుంచి అర్జిత సేవలు రద్దు.. కారణం ఇదే..!

|

Mar 30, 2021 | 1:46 PM

Arjitha Sevas Canceled: కరోనా స్వైర విహారంతో యాదాద్రి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మరో నాలుగు రోజుల పాటు ఆర్జిత సేవలు, నిత్యన్నదానం రద్దు చేసింది. రేపటి నుంచి ఏప్రిల్ మూడు వరకు ఆర్జిత సేవలు..

Yadadri Temple: యాదాద్రి దేవస్థానం కీలక నిర్ణయం.. బుధవారం నుంచి అర్జిత సేవలు రద్దు.. కారణం ఇదే..!
Yadadri Temple
Follow us on

తెలుగురాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. బడులు, గుడులనే టార్గెట్ చేస్తోంది. ఆలయాలకు వెళ్తున్న భక్తులతో పాటు సిబ్బంది వైరస్ బారినపడుతున్నారు. ఇలా కోవిడ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా స్వైర విహారంతో యాదాద్రి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మరో నాలుగు రోజుల పాటు ఆర్జిత సేవలు, నిత్యన్నదానం రద్దు చేసింది. రేపటి నుంచి ఏప్రిల్ మూడు వరకు ఆర్జిత సేవలు ఉండవని స్పష్టం చేసింది. లఘుదర్శనానికి మాత్రమే భక్తులు రావాలని సూచించారు ఈవో గీత.

శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్య వార్షిక బ్రహ్మోత్సవాలతో లక్షలాది భక్తులతో కిటకిటలాడిన ఆలయంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం అందర్ని ఆందోళనకు గురి చేస్తోంది. బ్రహ్మోత్సవాల చివరిరోజు ఓ అర్చకుడుతో పాటు దేవస్థానం సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. వాళ్లతో కలిసి పని చేసిన మరో 10మంది ఉద్యోగులు, అర్చకులు కరోనా పరీక్షలు చేయించుకోగా మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కేసుల పెరుగదలతో ఆర్జిత సేవలు రద్దు చేయాలని దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

అటు తిరుమల వచ్చే భక్తులపై ఆంక్షలు విధించింది టీటీడీ. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్నవారికే అనుమతిస్తామని స్పష్టం చేసింది. నడకదారి భక్తులకు ముందురోజు ఉదయం 9గంటల నుంచి అనుమతిస్తున్నారు. వాహనాల్లో వచ్చేవారికి ముందురోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అనుమతిస్తోంది టీటీడీ.

ఆలయాలకు వెళ్తున్న భక్తులు మాస్క్‌ ధరించడం లేదు. పైగా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ఈ కారణంగానే కరోనా వేగంగా విస్తరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అధికారులు నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.