స‌హ‌క‌రించాలి, డాక్ట‌ర్ల‌పై దాడులు స‌హించేది లేదుః ఈట‌ల‌

వైద్యులపై చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన మంత్రి ఈట‌ల...

స‌హ‌క‌రించాలి, డాక్ట‌ర్ల‌పై దాడులు స‌హించేది లేదుః ఈట‌ల‌

Updated on: Apr 18, 2020 | 2:57 PM

వైద్యులపై చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన మంత్రి ఈట‌ల… వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. సాక్షాత్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా మహమ్మారి నుంచి తన ప్రాణాలను కాపాడిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారని ఈటల ప్ర‌స్తావించారు. వైద్యులు తమ కుటుంబాలను పక్కన పెట్టి మరీ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అటువంటి వారిపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి ఈట‌ల మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కరోనా బాధితుల్లో కొందరు తలసేమియా వంటి వ్యాధితో బాధపడతున్నారన్న ఈటల, అటువంటి వారికి రక్తం అవసరమని, రక్తం కొరత లేకుండా రక్తదానానికి ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. టీఎన్జీవోలు ఇప్పటికే 200 మందికి పైగా రక్తదానం చేశారని చెప్పారు.