Vaccine: బూస్టర్ డోసుపై డబ్ల్యూహెచ్‌వో కీలక సూచన.. మూడో డోసు ఇక అప్పుడేనా

|

Aug 05, 2021 | 2:55 PM

కోవిడ్‌ను సమూలంగా నిర్మూలించేందుకు రెండు డోసుల టీకా వేసుకున్న తరువాత కూడా బూస్టర్ డోసు కూడా తీసుకోవాల్సి ఉంటుందని పలు అధ్యాయనాలు చెబుతున్నాయి. కొన్ని దేశాలు..

Vaccine: బూస్టర్ డోసుపై డబ్ల్యూహెచ్‌వో కీలక సూచన.. మూడో డోసు ఇక అప్పుడేనా
Vaccination
Follow us on

కోవిడ్‌ను సమూలంగా నిర్మూలించేందుకు రెండు డోసుల టీకా వేసుకున్న తరువాత కూడా బూస్టర్ డోసు కూడా తీసుకోవాల్సి ఉంటుందని పలు అధ్యాయనాలు చెబుతున్నాయి. కొన్ని దేశాలు దీన్ని ఇప్పటికే ఆచరణలో చూపుతున్నాయి. అయితే ఈ బూస్టర్ డోసు విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు కీలక సూచనలు చేసింది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసును ఇచ్చే ప్రణాళికను అమలు చేసే విషయంలో కొంత వేచి ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. బూస్టర్ డోసు ఇచ్చే ముందు ఆయా దేశాల్లో కనీసం 10 శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ప్రపంచ దేశాలకు సూచించారు. ఇజ్రాయిల్, జర్మనీ, ఫ్రాన్స్‌తోపాటు పలు దేశాలు బూస్టర్ డోసులను ఇప్పటికే ప్రారంభించడంతో తాజాగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

10 శాతం మంది రెండు డోసులు ఇచ్చే వరకు ఆగండి

బ్రిటన్, అమెరికా వంటి దేశాలు డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసు తీసుకోవాలని అక్కడి పౌరులకు సూచిస్తున్నాయి. అయితే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మాత్రం దేశంలో 10 శాతం మంది ప్రజలకు రెండు వ్యాక్సిన్లు వేసిన తరువాత డిసెంబర్‌లో బూస్టర్ డోసు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ సోకి కోలుకున్న వారిలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ 7 నుంచి 12 నెలలపాటు ప్రభావవంతంగా ఉంటాయని అధ్యాయనాల్లో తేలింది. అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీస్ ఎంతరకు సమర్థవంగా ఉంటాయన్న దానిపై మన దేశంలో అధ్యయనాలు జరుగుతున్నాయి. అవి తేలిన తరువాతే మన దేశంలో బూస్టర్ డోస్‌ను అందించే విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.