డుంగి గ్రామంలో కరోనా కలకలం.. అధికారులు ఏంచేశారంటే..?

| Edited By:

May 12, 2020 | 5:10 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు పదుల సంఖ్యలో మాత్రమే ఉండటంతో.. అక్కడి ప్రభుత్వాలు కూడా వైరస్ లోపలికి రాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా గోవా, త్రిపుర, మణిపూర్, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. అయితే ఉత్తరాఖండ్‌లో కూడా కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉంది. అయితే తాజాగా అక్కడ ఉత్తర కాశీ జిల్లాలో కరోనా కేసు నమోదవ్వడంతో.. […]

డుంగి గ్రామంలో కరోనా కలకలం.. అధికారులు ఏంచేశారంటే..?
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు పదుల సంఖ్యలో మాత్రమే ఉండటంతో.. అక్కడి ప్రభుత్వాలు కూడా వైరస్ లోపలికి రాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా గోవా, త్రిపుర, మణిపూర్, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. అయితే ఉత్తరాఖండ్‌లో కూడా కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉంది. అయితే తాజాగా అక్కడ ఉత్తర కాశీ జిల్లాలో కరోనా కేసు నమోదవ్వడంతో.. అంతా ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని డుంగి గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడంతో.. ఆ గ్రామాన్ని అష్ట దిగ్బంధనం చేసేశారు. జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ.. డుంగి గ్రామంలోని దేవిధర్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. ఈ గ్రామానికి వెళ్లే అన్ని దారుల్ని మూసేసినట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు.. గ్రామానికి కావాల్సిన నిత్యవసర సరకుల్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందన్నారు.