మంత్రి భార్యకు పాజిటివ్.. 41 మంది క్వారంటైన్‌

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలు.. రాజకీయ నాయకులను, పోలీసులను, జర్నలిస్టులను అందర్నీ తాకుతోంది. కులం, భాష, ప్రాంతం, దేశం అన్న తేడా ఏమీ లేదు ఈ మహమ్మారికి. తాజాగా ఉత్తరాఖండ్‌ మంత్రి వర్గంలో కరోనా టెన్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రి సత్పల్‌ మహారాజ్ భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో పాటు.. ఆయన ఇంట్లో ఉన్న 41 మంది క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజాగా మంత్రి శుక్రవారం నాడు.. ముఖ్యమంత్రితో కూడా […]

మంత్రి భార్యకు పాజిటివ్.. 41 మంది క్వారంటైన్‌

Edited By:

Updated on: May 31, 2020 | 3:08 PM

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలు.. రాజకీయ నాయకులను, పోలీసులను, జర్నలిస్టులను అందర్నీ తాకుతోంది. కులం, భాష, ప్రాంతం, దేశం అన్న తేడా ఏమీ లేదు ఈ మహమ్మారికి. తాజాగా ఉత్తరాఖండ్‌ మంత్రి వర్గంలో కరోనా టెన్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రి సత్పల్‌ మహారాజ్ భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో పాటు.. ఆయన ఇంట్లో ఉన్న 41 మంది క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజాగా మంత్రి శుక్రవారం నాడు.. ముఖ్యమంత్రితో కూడా కలిసి మాట్లాడారు. దీంతో ఇప్పుడు అక్కడి అధికారుల్లో కూడా కలకలం మొదలైంది. ఇప్పటికే మంత్రి సత్పల్‌ మహారాజ్‌తో పాటు.. అక్కడి సిబ్బందికి సంబంధించిన శాంపిల్స్‌ను కరోనా పరీక్షలకు తీసుకెళ్లారు. ఇక ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 749కి చేరింది.