కరోనాపై పోరు.. భారత్ కు చేరనున్న యుఎస్ వెంటిలేటర్లు..

| Edited By: Pardhasaradhi Peri

May 19, 2020 | 7:11 PM

కరోనాపై పోరులో భాగంగా ఇండియాకు అమెరికా 200 వెంటిలేటర్లను ‘డొనేట్’ చేయనుంది. ఇందులో మొదటి విడతగా 50 వెంటిలేటర్లు త్వరలో ఇండియాకు చేరనున్నట్టు తెలుస్తోంది. కరోనా రోగుల చికిత్స కోసం, ‘కనబడని శత్రువు నిర్మూలన’ కోసం తాము భారత దేశానికి వెంటిలేటర్లను పంపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా-ఇది ‘డొనేషన్’ అని యుఎస్ ఎయిడ్ తాత్కాలిక డైరెక్టర్ రమోనా హమ్ జౌ వ్యాఖ్యానించారు. మా దేశం, మా ప్రజల తరఫున ఉదారంగా […]

కరోనాపై పోరు.. భారత్ కు చేరనున్న యుఎస్ వెంటిలేటర్లు..
Follow us on

కరోనాపై పోరులో భాగంగా ఇండియాకు అమెరికా 200 వెంటిలేటర్లను ‘డొనేట్’ చేయనుంది. ఇందులో మొదటి విడతగా 50 వెంటిలేటర్లు త్వరలో ఇండియాకు చేరనున్నట్టు తెలుస్తోంది. కరోనా రోగుల చికిత్స కోసం, ‘కనబడని శత్రువు నిర్మూలన’ కోసం తాము భారత దేశానికి వెంటిలేటర్లను పంపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా-ఇది ‘డొనేషన్’ అని యుఎస్ ఎయిడ్ తాత్కాలిక డైరెక్టర్ రమోనా హమ్ జౌ వ్యాఖ్యానించారు. మా దేశం, మా ప్రజల తరఫున ఉదారంగా ఈ వెంటిలేటర్లను పంపుతున్నామన్నారు. వీటిని పంపే విషయమై భారత ప్రభుత్వంతో బాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతోను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతోనుసంప్రదింపులు జరుపుతున్నామని ఆమె వెల్లడించారు. భారత ప్రభుత్వ భాగ స్వామ్యంతో తమ సంస్థ 20 వేల మందికి పైగా హెల్త్ కేర్ వర్కర్లకు శిక్షణ ఇస్తున్నామని, వీరివల్ల అనేకమంది కరోనా రోగులకు చికిత్స లభించి త్వరగా కోలుకోగలుగుతారని ఆశిస్తున్నామని ఆమె చెప్పారు.