‘కోవిడ్-19 పార్టీ’ కి వెళ్లాడు.. శవమై మిగిలాడు

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 3:43 PM

అమెరికాలోని టెక్సాస్ లో  30 ఏళ్ళ ఓ వ్యక్తి కరోనా వైరస్ అంటే 'అల్లాటప్పా' వ్యాధి అనుకున్నాడు. ఇది అంతా ట్రాష్ అని, దీంతో తనకు పెద్ద డేంజరేమీ లేదని అనుకున్నాడట. కానీ చివరకు దానికే బలైపోయాడు. ఇతని వైనం విచిత్రంగా ఉంది. కరోనా వైరస్..

కోవిడ్-19 పార్టీ కి వెళ్లాడు.. శవమై మిగిలాడు
Follow us on

అమెరికాలోని టెక్సాస్ లో  30 ఏళ్ళ ఓ వ్యక్తి కరోనా వైరస్ అంటే ‘అల్లాటప్పా’ వ్యాధి అనుకున్నాడు. ఇది అంతా ట్రాష్ అని, దీంతో తనకు పెద్ద డేంజరేమీ లేదని అనుకున్నాడట. కానీ చివరకు దానికే బలైపోయాడు. ఇతని వైనం విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ సోకిన తన ఫ్రెండ్ ‘కోవిడ్-19’ పేరిట ఇచ్చిన పార్టీకి ఇతడు హాజరయ్యాడు. అమెరికాలో ఇప్పటివరకు ఈ మహమ్మారి లక్షా 35 వేల మందిని పొట్టన బెట్టుకున్నప్పటికీ బహుశా దీన్ని ఆషామాషీగా భావించినట్టున్నాడు. శాన్ ఆంటోనియో అనే హాస్పిటల్ డాక్టర్ ఒకరు ఇతని గురించి వివరిస్తూ..తమకు కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్టు ఎవరికైనా తేలితే.. వారు అసలిది నిజంగా వ్యాధేనా లేక.. బూటకమా అని నిర్ధారించుకునేందుకు దీని పేరిట ఏర్పాటు చేసే పార్టీకి తమ స్నేహితులను ఇన్వైట్ చేస్తారని,  ఈ మనిషి కూడా అలా  కోవిడ్ సోకిన తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడని అన్నారు. ఇక…కరోనా వైరస్ కి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. నర్సుతో.. తాను పొరబాటు చేశానని బావురుమన్నాడట. తన వయస్సు చిన్నదేనని, ఈ డిసీజ్ తనను ఏమీ చేయజాలదని అనుకుని పాపం చివరకు కరోనా ‘చేతిలో మోసపోయాడు’.