UK News: బ్రిటన్‌లో క్రిస్మస్‌పై ఆంక్షలు ఉండవు..! పీఎం బోరిస్ జాన్సన్ ఏం చెప్పాడంటే..?

UK News: క్రిస్మస్‌కు ముందు కఠినమైన కోవిడ్-19 నిబంధనలను అమలు చేయడాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తిరస్కరించారు. బ్రిటన్

UK News: బ్రిటన్‌లో క్రిస్మస్‌పై ఆంక్షలు ఉండవు..! పీఎం బోరిస్ జాన్సన్ ఏం చెప్పాడంటే..?
Boris Johnson
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 22, 2021 | 6:55 AM

UK News: క్రిస్మస్‌కు ముందు కఠినమైన కోవిడ్-19 నిబంధనలను అమలు చేయడాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తిరస్కరించారు. బ్రిటన్ ప్రజలు వరుసగా రెండో ఏడాది కూడా ఆంక్షల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాల్సి వస్తుందని ఊహాగానాలు రావడంతో ప్రధాని స్పందించారు. అనంతరం వీడియో ప్రసంగంలో ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పరిస్థితి అదుపులోనే ఉందని, డిసెంబర్ 25 తర్వాత మంత్రులు మరిన్ని ఆంక్షలను ప్రకటించవచ్చని పేర్కొన్నారు.

బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. క్రిస్మస్‌కు ముందు కఠిన ఆంక్షలను అమలు చేయాలనుకోవడం లేదని పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఓమిక్రాన్‌ను పర్యవేక్షిస్తూనే ఉంటామని, పరిస్థితి మరింత దిగజారితే, అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను కొత్త ఆంక్షలను ఇంకా ప్లాన్ చేయలేదని క్యాబినెట్ సమావేశం తర్వాత చెప్పారు. కానీ డిసెంబర్ 25 లోపు ఆంక్షలు ప్రవేశపెట్టే అవకాశం లేదన్నారు. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవచ్చని సంబరపడుతున్నారు. ఆర్థిక మంత్రి రిషి సునక్‌తో సహా అతని క్యాబినెట్ సభ్యులు ఓమిక్రాన్ తీవ్రత గురించి మరింత డేటాను పరిశీలించాలనుకుంటున్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థపై నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు UK ప్రభుత్వం Omicron వేరియంట్ ద్వారా ప్రభావితమైన హోటల్‌లు, రెస్టారెంట్లు, ఇతర సంబంధిత ప్రాంతాలకు వన్‌ బిలియన్ పౌండ్ల సహాయాన్ని అందిస్తుంది. పబ్‌లు, రెస్టారెంట్లు, ఇతర సంబంధిత వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం నిబంధనలు విధించడంతో హోటల్, రెస్టారెంట్ పరిశ్రమ నష్టాలలోకి వెళ్లాయి. UK ఆర్థిక మంత్రి రిషి సునక్ హోటల్‌లు, వినోద సంబంధిత పరిశ్రమలకు £1 బిలియన్ ప్యాకేజీని ప్రకటించారు.

ఆధార్‌ కార్డుతో ఓటర్‌ ఐడి లింక్‌ చేస్తే ప్రయోజనాలేమిటి..? ప్రభుత్వం ప్రతిపాదించే కొత్త బిల్లు గురించి తెలుసుకోండి..

’83’ సినిమాపై పన్ను మినహాయింపు.. సినీ ప్రేమికులకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గిఫ్ట్‌

బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే రూ.7500 నగదు బహుమతి..! ఈ ఆఫర్ డిసెంబర్‌ 31లోపు మాత్రమే..?

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు