U.K. COVID Variant: అమెరికాలో వేగంగా విస్తరిస్తోన్న స్ట్రెయిన్ .. తాజాగా 690 కొత్త వైరస్ కేసులు నమోదు

|

Feb 10, 2021 | 4:52 PM

చైనా లో పుట్టిన కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తోండగా తాజాగా బ్రిటన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ కు కొత్త వేరియంట్ అమెరికాలో చాలా వేగంగా విస్తరిస్తోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం..

U.K. COVID Variant: అమెరికాలో వేగంగా విస్తరిస్తోన్న స్ట్రెయిన్ .. తాజాగా 690 కొత్త వైరస్ కేసులు నమోదు
Follow us on

U.K. COVID Variant: చైనా లో పుట్టిన కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తోండగా తాజాగా బ్రిటన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ కు కొత్త వేరియంట్ అమెరికాలో చాలా వేగంగా విస్తరిస్తోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 లక్షల కరోనా వైరస్‌ పరీక్షలను, వందలాది జీనోమ్‌లను విశ్లేషించిన తర్వాత బి.1.1.7గా పిలిచే ఈ వేరియంట్‌ నెల రోజుల్లోగా అమెరికాలో ప్రబలమవుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీంతో తిరిగి దేశంలో వైరస్‌ మహమ్మారి పెచ్చరిల్లుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్ట్రెయిట్ తో అమెరికాలో మళ్ళీ కొత్త కేసులు పెరిగే అవకాశముందని, మళ్లీ మరణాల రేటు పెరగవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం శాస్త్రజ్ఞుల అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

గత నెలలో అమెరికా వ్యాధి నోరోధక నియంత్రణ కేంద్రం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు బ్రిటన్ కరోనా వైరస్ విషయం లో వ్యవహరించినట్లు అమెరికాలో కూడా వ్యవహరిస్తే.. మార్చి నెలకు కొత్త వైరస్ ఓ రేంజ్ లో ప్రభావం చూపించనున్నదని హెచ్చరిస్తున్నారు. గత వారం రోజుల్లో స్ట్రెయిన్ వైరస్ కేసులు రెట్టింపు అయ్యాయని.. ఇతరులకు వ్యాపించే రేటు 35 నుండి 45శాతం మేరకు పెరిగిందని అధ్యయనం వెల్లడించింది.

అంతేకాదు ప్రస్తుతం అమెరికాలో ఓ వైపు కరోనా కేసులు నమోదవుతుండగా.. మరోవైపు కొత్తగా వెలుగు చూసిన మూడు రకాల వైరస్‌లు ఎక్కువగా ప్రభలుతున్నాయని తెలిపారు. ఆదివారం నాటికి 34 రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త రూపాంతరమైన కొత్త కేసులు 699 బయటపడ్డాయని .. వీటిలో యూకే లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిట్ 690 కేసులు కాగా మరో ఆరు కేసులు దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించినవని.. మిగిలిన మూడు కేసులు బ్రెజిల్‌లో బయటపడిన కొత్త తరహా వైరస్ కేసులని ప్రకటించారు.

Also Read:

: కరోనా గీత దాటితే 10వేల పౌండ్ల వరకు జరిమానా, జైలు.. రెడ్​లిస్ట్​ను విడుదల చేసిన బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ

 టై కట్టుకోలేదని చట్ట సభ నుంచి ఎంపీ ని సస్పెండ్ చేసిన స్పీకర్.. ఎక్కడో తెలుసా..!