
ఇవాళ కరోనా వైరస్‌తో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఒకరు ముంబైలో.. మరొకరు కలకత్తాలో కోవిడ్‌తో మరణించారు. ప్రజలతో పోలీసులు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుండటంతో వారికి కరోనా ఎక్కువగా సోకుంది. కాగా కలకత్తాలోని సీల్దా ట్రాఫిక్ గార్డ్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ కరోనాతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అలాగే ఈ రోజు ముంబైలో కరోనాతో ఓ పోలీస్ మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో నలుగురు ముంబై పోలీస్ సిబ్బంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉంది. ఒక్క రోజులేనే 11,458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 ఉండగా.. 1,54,330 మంది డిశ్చార్జి అయ్యారు. 8,884 మంది మరణించగా.. 1,45,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మే 19నాటికి దేశంలో లక్ష కేసులు నమోదు కాగా, జూన్ 3నాటికి రెట్టింపు అయ్యాయి. ఇక మరో పది రోజుల్లోనే ఆ కేసులు 3 లక్షలకు చేరడం గమనార్హం. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా రికవరీ రేటు భారత్‌లో ఎక్కువగా ఉండటం ఆనందించాల్సిన విషయం.
Read More:
యాంకర్ సుమ అరుదైన ఫొటో.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..