ఇంటింటికి ఫ్రీగా మాస్కులు, శానిటైజర్ల పంపిణీ: ఎమ్మెల్యే శివకుమార్

|

Jul 22, 2020 | 3:09 PM

కేరళలో మరోమారు కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా కేరళలోని సముద్రతీర ప్రాంతాల్లో ఒక్కసారిగా అనేక కోవిడ్-19 కేసులు బయటపడడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి తరుణంలో

ఇంటింటికి ఫ్రీగా మాస్కులు, శానిటైజర్ల పంపిణీ: ఎమ్మెల్యే శివకుమార్
Follow us on

కేరళలో మరోమారు కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా కేరళలోని సముద్రతీర ప్రాంతాల్లో ఒక్కసారిగా అనేక కోవిడ్-19 కేసులు బయటపడడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి తరుణంలో స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలకు ఉచితంగా 2 లక్షల మాస్కులు, 50వేల శానిటైజర్లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే శివకుమార్ వెల్లడించారు.

కేరళలోని తిరువనంతపురం జిల్లా కోస్తా ప్రాంతాల్లో వైరస్ ఉధృతి నేపథ్యంలో పలుగ్రామాల్లో మళ్లీ పూర్తి లాక్‌డౌన్ విధించారు. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిషేధిస్తూ, రవాణా సౌకర్యాలు నిలిపివేసారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటరాకూడదని, వ్యాపారాలు, దుకాణాలు మూసేయాలని ఇప్పటికే  ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే పొంతురా, మాణిక్యవిలాకోం, బీంపల్లి, వలియాతుర, వల్లక్కడవు, ముత్తాతర, శంఘూముగోం, వెట్టుకాడ్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే నిధులతో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు.

ఈ మాస్కులు శానిటైజర్లను పొంతురా, వలియాతుర కోస్టల్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫోర్ట్ తాలూకా ఆసుపత్రుల ద్వారా ఇంటింటికి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు.