లాక్‌డౌన్‌లో సిగరెట్ల అమ్మకం.. అది కూడా అలా అమ్ముతూ..చివరకు..

| Edited By: Pardhasaradhi Peri

Apr 24, 2020 | 7:38 PM

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజానీకానికి నిత్యవసర వస్తువులు తప్ప ఇతర వస్తువులు కొనడానికి వీలులేకుండా అయ్యింది. అంతేకాదు.. మద్యం షాపులు కూడా దేశ వ్యాప్తంగా మూతపడ్డాయి. ఇక పలుచోట్ల పాన్‌ వంటి వాటిని కూడా నిషేధించారు. అయితే ఆన్‌లైన్‌ అమ్మకాలు కూడా బ్రేకులు పడ్డాయి. అందులో కేవలం నిత్యవసర సరుకులకు మాత్రమే షరతులతో కూడుకున్న అనుమతులు ఉన్నాయి. అయితే బెంగళూరులో ఓ ఇద్దరు కలిసి […]

లాక్‌డౌన్‌లో సిగరెట్ల అమ్మకం.. అది కూడా అలా అమ్ముతూ..చివరకు..
Follow us on

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజానీకానికి నిత్యవసర వస్తువులు తప్ప ఇతర వస్తువులు కొనడానికి వీలులేకుండా అయ్యింది. అంతేకాదు.. మద్యం షాపులు కూడా దేశ వ్యాప్తంగా మూతపడ్డాయి. ఇక పలుచోట్ల పాన్‌ వంటి వాటిని కూడా నిషేధించారు. అయితే ఆన్‌లైన్‌ అమ్మకాలు కూడా బ్రేకులు పడ్డాయి. అందులో కేవలం నిత్యవసర సరుకులకు మాత్రమే షరతులతో కూడుకున్న అనుమతులు ఉన్నాయి.

అయితే బెంగళూరులో ఓ ఇద్దరు కలిసి ముఠాగా ఏర్పడి.. ఆన్‌లైన్‌లో సిగరెట్ల అమ్మకానికి తెరలేపింది. దీంతో వారిని బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి రూ.30 వేల విలువ గల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అక్తర్‌ మిర్జా, తాబుద్దీన్‌ మొయినుద్దీన్‌ గా గుర్తించారు. ఘటనపై కేసుల నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు మూన్‌ లైట్‌ డెలివరీ పేరుతో ఈ సిగరెట్ల దందాకు తెరలేపారు. వీరి వద్ద దాదాపు 450 రకాల బ్రాండ్స్‌కు సంబంధించిన సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు.