కరోనా ఎఫెక్ట్ : షిఫ్ట్ డ్యూటీలో తిరుమల ఉద్యోగాలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 11, 2020 | 2:02 PM

TTD Employees in Shift Duties : కరోనా లాక్ డౌన్ కారణంగా 82 రోజుల పాటు నిలిచిపోయిన దర్శనాలకు అన్ లాక్ -1.0 లో తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులతో పాటుగా సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ ఆదేశాలు ఇచ్చింది, అందుకు అనుగూణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంది. శ్రీవారి దర్శనాలు పునరుద్ధరించి నేటికి […]

కరోనా ఎఫెక్ట్ : షిఫ్ట్ డ్యూటీలో తిరుమల ఉద్యోగాలు
Follow us on

TTD Employees in Shift Duties : కరోనా లాక్ డౌన్ కారణంగా 82 రోజుల పాటు నిలిచిపోయిన దర్శనాలకు అన్ లాక్ -1.0 లో తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులతో పాటుగా సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ ఆదేశాలు ఇచ్చింది, అందుకు అనుగూణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంది.

శ్రీవారి దర్శనాలు పునరుద్ధరించి నేటికి నెల రోజులు పూర్తి అవుతోంది. జూన్ 11 నుండి ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు నెలరోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న 2,63,000 మంది భక్తులు దర్శించుకున్నారు. జూన్ 11 నుండి జూలై 10 హుండీ ద్వారా 15 కోట్ల 80 లక్షలు ఆదాయం వచ్చింది. లక్షమంది పైగా తలనీలాలు సమర్పించుకున్నారు.

కరోనా వైరస్ నివారణకు టీటీడీ పటిష్ఠ చర్యలు తీసుకుంది. దర్శన క్యూలైన్లలో భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి చేసిన టీటీడీ.. క్యూలైన్‌లో శానిటైజర్లు, లిక్విడ్ ఓజోన్ స్ప్రేను కూడా ఏర్పాటు చేసింది. అయితే టీటీడీ ఉద్యోగుల్లో కరోనా కేసులు నమోదు కావడంతో మరింత జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది దేవస్థానం. దీంతో ఉద్యోగులకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేయిస్తోంది. ఇప్పుడు తాజాగా రెండువారాలకు ఓ సారి షిఫ్ట్ విధానంను ప్రవేశ పెట్టింది టీటీడీ.