రేపు టీఎస్ ఈసెట్ పరీక్ష.. మార్గదర్మకాలు ఇవే!

| Edited By:

Aug 30, 2020 | 5:01 PM

రెండు సెషన్‌లలో టీఎస్ ఈసెట్ జరగనుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్ జరగగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుందన్నారు. సరైన సమయానికి విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఇక ఎగ్జామ్‌ హాల్లో ఉన్నంత..

రేపు టీఎస్ ఈసెట్ పరీక్ష.. మార్గదర్మకాలు ఇవే!
TS ECET 2021 Exam
Follow us on

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడిన పరీక్షలను ఒక్కొక్కటిగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణలో ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమో, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తారు. కాగా ఈ పరీక్ష కోసం 28,015 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

ఈ సందర్భంగా టీఎస్ ఈసెట్ కన్వీనర్ ఎం మంజూర్ హుస్సేన్ మాట్లాడుతూ.. రెండు సెషన్‌లలో టీఎస్ ఈసెట్ జరగనుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్ జరగగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుందన్నారు. సరైన సమయానికి విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఇక ఎగ్జామ్‌ హాల్లో ఉన్నంత సేపు స్టూడెంట్స్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. అలాగే వారికి ధర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి లోపలికి పంపిస్తామన్నారు. ఇక ఖచ్చితంగా అందరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఈసెట్ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ఎం మంజూర్ హుస్సేన్ పేర్కొన్నారు.

Read More:

ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని