అమెరికా.. స్కూళ్ళు తెరవకపోయారో.. ట్రంప్ వార్నింగ్

తమ దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నప్పటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం స్కూళ్లను మళ్ళీ ప్రారంభించాలని పట్టుబడుతున్నారు. మీరు పాఠశాలలను తిరిగి తెరచి పిల్లలను రప్పించకపోతే మీకు నిధులను..

అమెరికా.. స్కూళ్ళు తెరవకపోయారో.. ట్రంప్ వార్నింగ్

Edited By:

Updated on: Jul 09, 2020 | 3:20 PM

తమ దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నప్పటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం స్కూళ్లను మళ్ళీ ప్రారంభించాలని పట్టుబడుతున్నారు. మీరు పాఠశాలలను తిరిగి తెరచి పిల్లలను రప్పించకపోతే మీకు నిధులను నిలిపివేస్తాం అని హెచ్చరించారు. పనిలో పనిగా ..మీరు జారీ చేసిన సేఫ్టీ గైడ్ లైన్స్ ఆచరణ సాధ్యం కావని, చాలా ఖర్చుతో కూడుకున్నవని తన సొంత ఆరోగ్య శాఖ అధికారులపైనే చిటపటలాడారు. ఈ ఎన్నికల సంవత్సరంలో ఆరోగ్య కారణాలను చూపి స్కూళ్లను మూసి ఉంచాలని కోరుతున్నారంటూ డెమొక్రాట్ల మీదా ఆయన నిప్పులు కక్కారు. సేఫ్టీ సమస్యలు వాటికవే పరిష్కారమవుతాయి.. విద్యార్థులు, వారి పేరెంట్స్ కూడా బడులను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారని, అందువల్ల వీటిని తెరవకపోతే నిధులను ఆపివేస్తామని స్కూళ్ల యాజమాన్యాలకు వార్నింగ్  ఇచ్చారు. జర్మనీ, డెన్మార్క్, నార్వే దేశాలు ఎలాంటి సమస్యలు లేకుండా బడులు తెరిచాయి అని ట్వీట్ చేశారు. అయితే ఈ హెచ్ఛరికలను కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ఖండించారు. ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయని, స్కూళ్లను ప్రారంభించవచ్చునని అధికారులు సూచించినప్పుడే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని న్యూయార్క్ గవర్నర్ ఏండ్రు క్యోమో పేర్కొన్నారు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయమని స్పష్టం చేశారు.