టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోన‌ప్ప దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప దంప‌తుల‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. గ‌త రెండు, మూడు రోజులుగా స్వ‌ల్ప అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కోన‌ప్ప దంప‌తులు బుధ‌వారం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోన‌ప్ప దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్

Edited By:

Updated on: Aug 26, 2020 | 6:00 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప దంప‌తుల‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. గ‌త రెండు, మూడు రోజులుగా స్వ‌ల్ప అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కోన‌ప్ప దంప‌తులు బుధ‌వారం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా.. వారిద్ద‌రికి పాజిటివ్‌గా తేలిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. దీంతో కాగ‌జ్ న‌గ‌ర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో ప్ర‌త్యేక ఐసోలేష‌న్‌లో చికిత్స తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

కాగా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. ఇందులో 25,685 యాక్టివ్ కేసులు ఉండగా.. 85,223 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1,060 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 10 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 780కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 61,040 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 10,82,094కి చేరింది.

Read More:

సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భార‌తీరాజా

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

బ్రేకింగ్ః తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌