లాక్‌డౌన్ కారణంగా సినిమా ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇంట్లో ఉంటూ వారు చేసే పనులు, డ్యాన్సులు, వ్యాయామాలు వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తమకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇలా షూటింగ్ లు లేక పోవటంతో సోషల్ మీడియాను అద్భుతంగా వాడుకుంటున్నారు సినీ ప్రముఖులు.
అయితే సీనియర్ హీరోయిన్ త్రిష సోషల్ మీడియా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతానికి నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియకుండా ఉండటం మంచిది. మైండ్‌కు ఇది డిజిటల్ చికిత్స లాంటిది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. లవ్ యూ గాయ్స్.. త్వరలోనే కలుసుకుందాం’ అంటూ త్రిష ట్వీట్ చేశారు.
On a happy but “my mind needs oblivion at the moment” note,a digital detox it is…..
Stay home!Stay safe!This too shall pass?
Love you all and see you soon?— Trish (@trishtrashers) June 13, 2020