
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి మొదలుకుని.. అన్ని వర్గాల వారిని తాకుతోంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బందిని వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది వేల మంది సిబ్బందికి పైగా కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో తొంబై మందికి పైగా కరోనా బారినపడి మరణించారు. తాజాగా మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నాటికి 8,232 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 6,314 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,825 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 93 మంది పోలీస్ సిబ్బంది మరణించారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజుకు అరలక్ష వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం నాటికి దేశ వ్యాప్తంగా 13 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వీటిలో 8.49 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4.56 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Total #COVID19 positive cases in Maharashtra Police stand at 8,232 including 1,825 active cases, 6,314 recoveries and 93 deaths: Maharashtra Police pic.twitter.com/ZNaOF8eGLW
— ANI (@ANI) July 25, 2020