మ‌ద్యం తాగ‌డంలో టాప్‌ 5 రాష్ట్రాలు..ఏపీ, తెలంగాణ రేటింగ్ !

|

May 08, 2020 | 3:22 PM

దేశంలోని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు విరివిగా ఆదాయం తెచ్చిపెట్టేది ఏదంటే ఎవ‌రైనా ట‌క్కున చెప్పేది ఒక్క‌టే అది మ‌ద్య‌పానం. అవును ఇది లాక్‌డౌన్ స‌డ‌లింపుతో మ‌రోమారు రుజువైంది. క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లుతో మ‌ద్యం అమ్మ‌కాలు కూడా నిలిచిపోయాయి. గ‌త 45 రోజుల త‌ర్వాత తిరిగి తెరుచుకున్న లిక్క‌ర్ సేల్స్ ఆయా రాష్ట్రాల ఖ‌జానాకు భారీగా సొమ్ముచేసి పెట్టాయి. అమ్మ‌కాలు మొద‌లైన తొలి రోజే కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వాలే వెల్ల‌డించాయి. […]

మ‌ద్యం తాగ‌డంలో టాప్‌ 5 రాష్ట్రాలు..ఏపీ, తెలంగాణ రేటింగ్ !
Follow us on

దేశంలోని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు విరివిగా ఆదాయం తెచ్చిపెట్టేది ఏదంటే ఎవ‌రైనా ట‌క్కున చెప్పేది ఒక్క‌టే అది మ‌ద్య‌పానం. అవును ఇది లాక్‌డౌన్ స‌డ‌లింపుతో మ‌రోమారు రుజువైంది. క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లుతో మ‌ద్యం అమ్మ‌కాలు కూడా నిలిచిపోయాయి. గ‌త 45 రోజుల త‌ర్వాత తిరిగి తెరుచుకున్న లిక్క‌ర్ సేల్స్ ఆయా రాష్ట్రాల ఖ‌జానాకు భారీగా సొమ్ముచేసి పెట్టాయి. అమ్మ‌కాలు మొద‌లైన తొలి రోజే కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వాలే వెల్ల‌డించాయి. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో మ‌ద్యం అమ్మ‌కాలు, తాగుడులో ముందున్న రాష్ట్రాల‌ను గుర్తించేందుకు ఓ సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది. ఆ స‌ర్వే మేర‌కు ఆయా రాష్ట్రాల‌కు ర్యాంకుల‌ను కేటాయించింది. మొద‌టి ఐదు స్థానాల్లో త‌మిళ‌నాడు ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే….

క్రెడిట్ రేటింగ్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌ర్వీసెస్ ఆఫ్ ఇండియా స‌ర్వే ప్ర‌కారం దేశంలో ఉత్ప‌త్తి అయ్యే మ‌ద్యాన్ని ద‌క్షిణాది రాష్ట్రాల్లోని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, కేర‌ళ ప్ర‌జ‌లే ఎక్కువ‌గా తాగుతున్నారు. వీటిలో త‌మిళ‌నాడు 13 శాతంతో మొద‌టి స్థానంలో నిలిచింది. క‌ర్ణాట‌క 12 శాతం మ‌ద్యం సేవించేవారితో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఏపీ 7శాతంతో మూడో స్థానం, తెలంగాణ 6 శాతంతో నాలుగో స్థానం, కేర‌ళ 5 శాతంతో టాప్ 5లో ఆఖ‌రు స్థానంలో నిలిచింది. వీటితో పాటు ఢిల్లీ, పంజాబ్‌, యూపీ, వెస్ట్ బెంగాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో 75శాతం మ‌ద్యం వినియోగంలో ఉంది.