తెలంగాణలో తీవ్రంగా పెరుగుతోన్న కరోనా కేసులు.. వెయ్యికి చేరువలో

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతోన్నాయి. దాదాపు వెయ్యికి దగ్గరలో కోవిడ్ కేసులు చేరాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు...

తెలంగాణలో తీవ్రంగా పెరుగుతోన్న కరోనా కేసులు.. వెయ్యికి చేరువలో

Edited By:

Updated on: Apr 21, 2020 | 8:26 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతోన్నాయి. దాదాపు వెయ్యికి దగ్గరలో కోవిడ్ కేసులు చేరుతున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 19 కరోనా పాజిటివ్ కేసులు, గద్వాలలో 2, నిజామాబాద్‌లో 3, ఆదిలాబాద్‌లో 2 కేసులు నమోదు అయ్యాయి. కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 928కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 23 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటివరకూ194 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఒక్క రోజే 8 మందిని డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ రోజు అత్యధికంగా సూర్యాపేటలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను, అధికారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

Read More: 

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..