ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి విపరీతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ కీలకం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో పలు కీలకాంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ వేయడంతో ఈ అంశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ప్రధానంగా కేబినెట్ మీటింగ్‌లో చర్చించబోతున్నారని సమాచారం.
-వైఎస్ఆర్ ఆసరా పథకంపై చర్చించనున్న కేబినెట్
-నాలుగేళ్లలో 27వేల కోట్లకు పైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి
-నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపనున్న కేబినెట్
-వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై చర్చ
-సెప్టెంబర్ 5న ఇచ్చే వైఎస్ఆర్ విద్యా కానుకకు ఆమోదం తెలిపనున్న కేబినెట్
తదితర అంశాలపై ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించబోతున్నారు సీఎం జగన్.
Read More: