కరోనా ఎఫెక్ట్‌తో వ్యక్తి మృతి.. అతని ముగ్గురు భార్యలతో పాటు 16 మంది పిల్లల పరిస్థితి ఏంటంటే..?

| Edited By:

Apr 01, 2020 | 6:03 PM

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా హడలెత్తిస్తోంది. ఇప్పటికే దేశంలో వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మహమ్మారి పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా విజృంభిస్తోంది. తాజాగా మూడు నాలుగు రోజుల క్రితం ఓ 65 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఇతని మరణంతో అక్కడి రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే మరణించిన ఈ వ్యక్తి.. ఇటీవల మార్చి […]

కరోనా ఎఫెక్ట్‌తో వ్యక్తి మృతి.. అతని ముగ్గురు భార్యలతో పాటు 16 మంది పిల్లల పరిస్థితి ఏంటంటే..?
Follow us on

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా హడలెత్తిస్తోంది. ఇప్పటికే దేశంలో వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మహమ్మారి పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా విజృంభిస్తోంది. తాజాగా మూడు నాలుగు రోజుల క్రితం ఓ 65 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఇతని మరణంతో అక్కడి రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే మరణించిన ఈ వ్యక్తి.. ఇటీవల మార్చి 5కు ఢిల్లీ వెళ్లి.. తిరిగి 11న రిటర్న్ వచ్చినట్లు.. తుముకూరు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 33 మందిని కలిసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతనికి ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి స్థానికులు వారికి కూడా కరోనా సోకి ఉండొచ్చంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతుని ముగ్గురు భార్యలను, పిల్లలను అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. అంతేకాదు.. ఆ ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉండే ఇతర కుటుంబాలను కూడా క్వారంటైన్‌లో ఉంచినట్లు తుముకూరు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.