ప్రధాని సంచలన నిర్ణయం.. జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు..

|

May 11, 2020 | 9:51 AM

బ్రిటన్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 219,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 31,855 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపధ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్‌ను జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు.(నేటి నుంచి రైల్వే బుకింగ్ ప్రారంభం.. నిబంధనలు ఇవే..) ‘కరోనా ఉధృత్తి తీవ్రంగా ఉన్న సమయంలో […]

ప్రధాని సంచలన నిర్ణయం.. జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు..
Follow us on

బ్రిటన్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 219,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 31,855 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపధ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్‌ను జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు.(నేటి నుంచి రైల్వే బుకింగ్ ప్రారంభం.. నిబంధనలు ఇవే..)

‘కరోనా ఉధృత్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఈ వారంతోనే లాక్ డౌన్ ముగించడం అంత మంచిది కాదని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని’ ఆయన తెలిపారు. ఏది ఏమైనా జూన్ 1 నుంచి కొన్ని పాఠశాలలు, దుకాణాలు తెరుచుకుంటాయన్నారు. ఇక జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలకు మాత్రం జూలై 1 తర్వాతనే అనుమతిస్తామన్నారు. అటు విదేశాల నుంచి ఎవరైనా బ్రిటన్ వచ్చినట్లయితే.. వారు తప్పకుండా క్వారంటైన్ నియమాలు పాటించాలని స్పష్టం చేశారు.

Read This: నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!