‘వైరస్ కనిపించక పోవచ్చు.. కానీ వారియర్సే విజేతలు’.. ప్రధాని మోదీ

కరోనా వైరస్ కనిపించకపోవచ్చునని, కానీ దీనిపై పోరాడే ఫ్రంట్ లై న్ వారియర్సే విజేతలని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఫైట్-కనిపించని దానికి, ఓడించలేనివారికి..

వైరస్ కనిపించక పోవచ్చు.. కానీ వారియర్సే విజేతలు.. ప్రధాని మోదీ

Edited By:

Updated on: Jun 01, 2020 | 2:00 PM

కరోనా వైరస్ కనిపించకపోవచ్చునని, కానీ దీనిపై పోరాడే ఫ్రంట్ లై న్ వారియర్సే విజేతలని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఫైట్-కనిపించని దానికి, ఓడించలేనివారికి మధ్య జరుగుతున్నదని, కానీ చివరకు వారియర్సే విజేతలవుతారని ఆయన  పేర్కొన్నారు.  మెడికల్ వర్కర్లపై దాడులు, దౌర్జన్యాలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ‘కరోనా మహమ్మారిపై మన మెడికల్ సిబ్బంది ధైర్యంగా పోరాడుతున్నారు. డాక్టర్లు,  హెల్త్ కేర్ వర్కర్లు సైనిక దుస్తులు లేకున్నా సైనికుల్లాంటివారే’ అని మోదీ అభివర్ణించారు. బెంగుళూరులో సోమవారం ఉదయం రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ రజతోత్సవాల ఇనాగురేషన్ ని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు.