తెలంగాణలో కరోనా కట్టడికి రూ.216 కోట్లు ఇచ్చాం-కేంద్ర మంత్రి

|

Jul 11, 2020 | 2:20 PM

హైదరాబాద్‌లోని కొవిడ్ టెస్టింగ్ సెంటర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. నల్లకుంటలోని పీహెచ్సీ సెంటర్, లాలాగూడలోని రైల్వే హాస్పిటల్‌లోని కరోనా టెస్టింగ్ సెంటర్లను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ జరుగుతున్న కరోనా టెస్టుల తీరును అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ నియంత్రనకు రూ.216 కోట్లు కేటాయించామని… ఇంకా అవసరమైతే ఎన్ని నిధులైనా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల 14 వేల N-95 మాస్క్‌లు ఇచ్చామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీటితోపాటు […]

తెలంగాణలో కరోనా కట్టడికి రూ.216 కోట్లు ఇచ్చాం-కేంద్ర మంత్రి
Follow us on

హైదరాబాద్‌లోని కొవిడ్ టెస్టింగ్ సెంటర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. నల్లకుంటలోని పీహెచ్సీ సెంటర్, లాలాగూడలోని రైల్వే హాస్పిటల్‌లోని కరోనా టెస్టింగ్ సెంటర్లను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ జరుగుతున్న కరోనా టెస్టుల తీరును అడిగి తెలుసుకున్నారు.

కొవిడ్ నియంత్రనకు రూ.216 కోట్లు కేటాయించామని… ఇంకా అవసరమైతే ఎన్ని నిధులైనా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల 14 వేల N-95 మాస్క్‌లు ఇచ్చామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీటితోపాటు పీపీఈ (PPE) కిట్స్ 2,40,000 ఇచ్చాం
Icmr ద్వారా 34 లాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. 1250 వెంటిలేటర్స్‌లో ఇప్పటికే 688 వెంటిలేటర్స్ అందించామని.. BEL నుంచి ఉత్పత్తి రాగానే వెంటిలేటర్స్ అందిస్తామని వెల్లడించారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి.