క్లినికల్ ట్రయల్స్ లో 10 మందులు.. డొనాల్డ్ ట్రంప్

| Edited By: Pardhasaradhi Peri

Apr 09, 2020 | 4:10 PM

ఇండియా ఉత్పత్తి చేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు తమకు ఎంతో అవసరమని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మలేరియా చికిత్సలో వాడే ఈ మెడిసిన్.. కరోనా ట్రీట్ మెంట్ కు మరీ ఉపయోగపడకపోవచ్చునని , దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు హెఛ్చరించిన నేపథ్యంలో మాట మార్చారు. తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా అదుపునకు సరైన థెరాపెటిక్ సొల్యూషన్ ‘ ని కనుగొనేందుకు ప్రస్తుతం 10 మందుల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అమెరికాలో కరోనాకు […]

క్లినికల్ ట్రయల్స్ లో 10 మందులు.. డొనాల్డ్ ట్రంప్
Follow us on

ఇండియా ఉత్పత్తి చేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు తమకు ఎంతో అవసరమని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మలేరియా చికిత్సలో వాడే ఈ మెడిసిన్.. కరోనా ట్రీట్ మెంట్ కు మరీ ఉపయోగపడకపోవచ్చునని , దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు హెఛ్చరించిన నేపథ్యంలో మాట మార్చారు. తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా అదుపునకు సరైన థెరాపెటిక్ సొల్యూషన్ ‘ ని కనుగొనేందుకు ప్రస్తుతం 10 మందుల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అమెరికాలో కరోనాకు గురై 14 వేల మందికి పైగా మృత్యు బాట పట్టగా.. 4. 3 లక్షల మంది ఈ ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. అందువల్లే మరో 10  మందులను ల్యాబ్ లలో రీసెర్చర్లు పరీక్షిస్తున్నారని ట్రంప్ చెప్పారు. అమెరికా ఇండస్ట్రీ, డాక్టర్లు, శాస్త్రవేత్తలు అందరూ వీటిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సరికొత్త చికిత్సా విధానాలను కనుగొని వీటికి సంబంధించిన ప్రయోజనాలను రోగులకు, బాధితులకు అందించవలసి ఉందని ఆయన పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లతో బాటు వివిధ కంపెనీలు కూడా తమ ప్రతిపాదనలతో ముందుకు రావడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ఇవి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు.

అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ పై వేర్వేరుగా నాలుగు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. ఏది ఏమైనా ఈ మందు కరోనా చికిత్సకు సరైనదేనని అనుభవజ్ఞుడైన డాక్టర్ లేదా పిజిషియన్ సూచిస్తేనే సముచితమని, అప్పుడే అమెరికా అంతటా ఇది లభ్యమయ్యేలా చూస్తామని ఆయన చెప్పారు.’ హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రిలో ఈ మందుకు  సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సుమారు మూడు వేల మంది రోగులకు ఈ మందును ఇస్తున్నారు’ అని ఆయన తెలిపారు.   అయితే వైట్ హౌస్ లో కరోనా నివారణకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ సభ్యుడు  డాక్టర్ ఆంథోనీ ప్హౌసీ మాత్రం .. ఈ మెడిసిన్ మలేరియా, కీళ్ల నొప్పులకు బాగా పని చేస్తుందని,  ఈ విషయాన్ని అధికారికంగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. అంతే తప్ప..కోవిడ్ చికిత్సకు సంబంధించి ఇంకా దీనిపై పరీక్షలు జరగాలన్నారు.’ కరోనా వైరస్ ని ఈ మెడిసిన్ నాశనం చేస్తుందని చెప్పడానికి మరిన్ని క్లినికల్  ట్రయల్స్ నిర్వహించడం ముఖ్యం.. గుండె జబ్బులున్న కరోనా రోగులపై ఇది సైడ్ ఎఫెక్ట్స్ చూపే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.   కాగా-అమెరికా, బ్రెజిల్ దేశాలతో బాటు శ్రీలంక, నేపాల్ కూడా తమకు ఈ మందు కావాలని ఇండియాను కోరుతున్నాయి.