Telangana Coronavirus Cases: తెలంగాణలో కరోనా మహమ్మారి కుదుటపడుతోంది. మొదటి, రెండు విడతల్లో విజృంభించిన వైరస్ ఉధృతి తగ్గింది. మెల్లమెల్లగా పాజిటివ్ కేసుల సంఖ్య కిందకు దిగివస్తోంది. తాజా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 412కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,54,394కు చేరుకుంది. ఇక, కొత్తగా కరోనా వైరస్ బారినపడిన వారిలో 494 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారు 6,43,812గా నమోదు అయ్యింది. కాగా, గడిచిన 24గంటల వ్యవధిలో మరో ఇద్దరు మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
ఇక, రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 6,54,394కు పెరిగాయి. వీరిలో ఇవాళ్టివరకు 6,43,812 మంది కోలుకున్నారు. మరో 6,728 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం మరణాలు 3,854కు పెరిగాయి. ఇవాళ మరో 73,899 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక, జిల్లాల వారీగా కోవిడ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి….
Read Also… Covid 19 Vaccine: గుడ్ న్యూస్.. దేశంలోకి మరో కరోనా వ్యాక్సిన్.. అనుమతి ఇచ్చిన డీసీజీఐ
Breast Milk: కరోనా సోకిన తల్లి చనుబాల రంగులో మార్పు.. ఇలా జరగడానికి కారణం ఏంటి? ఏమైనా ప్రమాదామా.?