తెలంగాణలో జూన్ 3న ఇంటర్ పరీక్షలు..

ఇలా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయో లేదో.. అలా కరోనా వైరస్ తీవ్రత దేశంలో ఎక్కువై లాక్ డౌన్ అమలులోకి రావడం జరిగింది. దీనితో విద్యార్ధులకు సెలవులు ఇచ్చేశారు. పరీక్షలన్నింటిని వాయిదా వేసేశారు. ఇక ఇప్పుడు వాయిదాపడిన ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు సిద్దమైంది. ఈ మేరకు జూన్ 3వ తేదీన ఇంటర్ ద్వీతీయ సంవత్సరం జియాగ్రఫీ పేపర్‌–2, మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ […]

తెలంగాణలో జూన్ 3న ఇంటర్ పరీక్షలు..

Updated on: May 14, 2020 | 8:09 AM

ఇలా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయో లేదో.. అలా కరోనా వైరస్ తీవ్రత దేశంలో ఎక్కువై లాక్ డౌన్ అమలులోకి రావడం జరిగింది. దీనితో విద్యార్ధులకు సెలవులు ఇచ్చేశారు. పరీక్షలన్నింటిని వాయిదా వేసేశారు. ఇక ఇప్పుడు వాయిదాపడిన ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు సిద్దమైంది.

ఈ మేరకు జూన్ 3వ తేదీన ఇంటర్ ద్వీతీయ సంవత్సరం జియాగ్రఫీ పేపర్‌–2, మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా.. పాత పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షలు ఉంటాయని.. విద్యార్ధులు [పాత హాల్ టికెట్లతోనే హాజరు కావచ్చునని ఆయన స్పష్టం చేశారు.

Read This: కల్లు ప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త..