తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

| Edited By:

May 19, 2020 | 1:09 PM

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని  తెలిపింది హైకోర్ట్. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి..

తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
Follow us on

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని  తెలిపింది హైకోర్ట్. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే కనుక కరోనా నివారణ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని టీఎస్ సర్కార్‌కి సూచించింది హైకోర్టు. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది.

కాగా హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమయింది. ఇప్పటికే రెండు పరీక్షలు జరగ్గా.. ఇంకా నాలుగు పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని నిర్వహించేందుకు సిద్ధమయ్యింది తెలంగాణ విద్యాశాఖ. అంతేకాక కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల్లో హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామంది. ప్రతీ బెంచ్‌కు ఒకరు మాత్రమే కూర్చునే విధంగా.. విద్యార్ధుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది టీఎస్ విద్యాశాఖ.

ఇది కూడా చదవండి: 

బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి