కల్లు ప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త..

|

May 14, 2020 | 8:03 AM

కల్లు ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతిచ్చిన కేసీఆర్ సర్కార్.. తాజాగా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా జిల్లాల్లో కల్లు విక్రయాలకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చెట్ల వద్దే కల్లు తీసి విక్రయించేందుకే అనుమతి ఇస్తున్నామని, కల్లు దుకాణాలకు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నామని ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కాగా, లాక్ డౌన్ నిబంధనలకు లోబడి భౌతిక దూరాన్ని పాటిస్తూ కల్లు విక్రయాలు జరగాలన్న […]

కల్లు ప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త..
Follow us on

కల్లు ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతిచ్చిన కేసీఆర్ సర్కార్.. తాజాగా కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా జిల్లాల్లో కల్లు విక్రయాలకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చెట్ల వద్దే కల్లు తీసి విక్రయించేందుకే అనుమతి ఇస్తున్నామని, కల్లు దుకాణాలకు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నామని ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

కాగా, లాక్ డౌన్ నిబంధనలకు లోబడి భౌతిక దూరాన్ని పాటిస్తూ కల్లు విక్రయాలు జరగాలన్న ఆయన.. పోలీసులు కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 1367కు చేరుకున్నాయి. బుధవారం కరోనా వల్ల మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఈ మ‌హమ్మారి వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 34కు చేరింది.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!