Srinivasa Rao: ఎవరిని వదలని కరోనా మహమ్మారి.. తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు పాజిటివ్!

|

Jan 18, 2022 | 5:55 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి.

Srinivasa Rao: ఎవరిని వదలని కరోనా మహమ్మారి.. తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు పాజిటివ్!
Srinivas Rao
Follow us on

Director of Health Srinivasa Rao: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణ వ్యాప్తంగా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ, ఫ్రంట్‌లైన్ వారియర్స్ సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, అధికారులను సైతం కరోనా మహమ్మారి కంగారు పెడుతోంది.

తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. స్వల్పంగా కరోనా లక్షణలు కనిపించడంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఐసోలేషన్, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నట్టు హెల్త్ డైరెక్టర్ స్వయంగా తెలిపారు. ఏ విధమైన ఆందోళన, అపోహలు అవసరం లేదని, త్వరలోనే కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని శ్రీనివాసరావు చెప్పారు. కరోనా మహమ్మారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ సూచించారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

ఇదిలావుంటే, గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా పరిధిలో 159 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 73 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.

Read Also… Police Corona: పోలీసులపై కరోనా పంజా.. గ్రేటర్ పరిధిలో 72 మందికి పాజిటివ్!