Telangana Covid 19 Cases: తెలంగాణలో కోవిడ్ (Telangana Covid 19 Cases) వ్యాప్తి పెరుగుతోంది. అయితే అదే స్థాయిలో రికవరీ రేటు కూడా ఉండటం కొంత వరకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇక తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 68,525 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,398 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,05,199కి చేరింది. కోవిడ్ కారణంగా ముగ్గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,052కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,181 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 6,79,471కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,676 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 3,05,20,564 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 1233,రంగారెడ్డి192,మేడ్చెల్ 191 కేసులు నమోదయ్యాయి.
అయితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పెంచడంతో రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘బేబీ షార్క్’ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..
Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. ఇందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..