Mallu Bhatti Vikramarka: మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ప్రముఖుల ట్వీట్లు..

సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క  త్వరగా కోలుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ,  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , నల్గొండ ఎంపీ మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి..

Mallu Bhatti Vikramarka: మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ప్రముఖుల ట్వీట్లు..
Mallu Bhatti Vikramarka

Updated on: Jan 17, 2022 | 1:30 PM

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఆదివారం కూడా రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు చాలా మంది ఈ వైరస్ కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతన్నారు. తాజాగా  తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ గా  నిర్దారణ  అయింది.  తాజాగా చేయించుకున్న టెస్టుల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. అపోలో ఆసుపత్రి వైద్యులు కోవిడ్ కు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిపై భట్టి విక్రమార్క ఓ లేఖను విడుదల చేశారు.

భట్టి విక్రమార్క గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు తప్పనిసరిగా covid పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క గారు సూచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. కరోనా విజృంభన నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని భట్టి విక్రమార్క కోరారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత తానే బయటకు వస్తానని, అందరినీ కలుస్తానని చెప్పకొచ్చారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

త్వరగా కోలుకోవాలని..

ట్విట్టర్ వేదికగా సీఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క  త్వరగా కోలుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ,  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , నల్గొండ ఎంపీ మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

ఇవి కూడా చదవండి: Pandit Birju Maharaj: ఆ సవ్వడి ఇక వినిపించదు.. ప్రముఖ కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్‌‌కు గుండెపోటు

Glowing Skin : చలికాలంలో మెరిసే చర్మం కోసం.. ఈ వింటర్ సూపర్ ఫుడ్స్.. మీ డైట్‌లో చేర్చుకోండి