తెలంగాణలో పదవ తరగతి పరీక్షలపై వీడని సస్పెన్స్

|

Jun 06, 2020 | 7:50 AM

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు నిన్న జరిగిన విచారణలోనూ హైకోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది.

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలపై వీడని సస్పెన్స్
Follow us on

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు నిన్న జరిగిన విచారణలోనూ హైకోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది.

ఒకవేళ టెన్త్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించడానికే సిద్ధమైతే కంటైన్మెంట్ జోన్లలో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థుల పరిస్థితేంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు రాయలేకపోయిన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. అయితే సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించిన హై కోర్టు, తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే హైకోర్టు ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వాన్ని సంప్రదించి ఇవాళ సమాధానం చెబుతామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

టెన్త్‌ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ ప్రకారం జూన్ 8 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అంటే ఎల్లుండి నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి.. అయితే పరీక్షల నిర్వహణ అంశం మాత్రం ఇంకా కోర్టులోనే నానుతుండటంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు పరీక్షలు జరుగుతాయా? లేదా? అనే సందేహాలు వారిని వేధిస్తున్నాయి. ఇవాళ హైకోర్టులోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.