విమానాల్లో ‘ఆ’ అవసరం లేదు..

|

Jun 27, 2020 | 6:25 AM

అంతర్జాతీయ విమానాల్లో మధ్యసీటును ఖాళీగా వదలాల్సిన అవసరం లేదని… ఆ సీటునూ విక్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశీయ విమానాల్లో మధ్యసీటు భర్తీకి అనుకూలంగా బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను విమానయాన సంస్థలు పాటిస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ భూషన్‌ గవాయ్‌లతో కూడిన బెంచ్‌ ఈ ఆదేశాలిచ్చింది. దేశీయ […]

విమానాల్లో ఆ అవసరం లేదు..
Follow us on

అంతర్జాతీయ విమానాల్లో మధ్యసీటును ఖాళీగా వదలాల్సిన అవసరం లేదని… ఆ సీటునూ విక్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశీయ విమానాల్లో మధ్యసీటు భర్తీకి అనుకూలంగా బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను విమానయాన సంస్థలు పాటిస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ భూషన్‌ గవాయ్‌లతో కూడిన బెంచ్‌ ఈ ఆదేశాలిచ్చింది. దేశీయ విమాన సర్వీసుల్లో మధ్య సీటును భర్తీ చేసుకోవచ్చని బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎయిరిండియా పైలట్‌ దేవన్‌ కనాని వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్పింది.