ఆర్‌కే పురం కంటైన్మెంట్‌లో ఆంక్షాలు

|

Apr 12, 2020 | 3:31 PM

ఆర్‌కే పురం కంటైన్మెంట్‌లో 48 కుటుంబాల‌ను అబ్జార్వేష‌న్‌లో ఉంచారు.........

ఆర్‌కే పురం కంటైన్మెంట్‌లో ఆంక్షాలు
Follow us on
హైద‌రాబాద్ మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఆర్‌కే పురంలో క‌రోనా అనుమానితుల కోసం కంటైన్మెంట్ ఏర్పాటు చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌లో 48 కుటుంబాల‌ను అబ్జార్వేష‌న్‌లో ఉంచారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ చాలా మంది నిబంధ‌న‌లు ఉల్లంఘించి రోడ్ల‌పైకి వ‌స్తున్న‌ట్లుగా గుర్తించిన అధికారులు భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచారు.
ఆర్‌కేపురంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ను జీహెచ్ ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఇత‌ర జీహెచ్ ఎంసీ అధికారుల ఆధ్వ‌ర్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. లాక్‌డౌన్ ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌టానికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆ ప్రాంత‌మంతా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంట‌ల పాటు పోలీసులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్న‌వారికి కావాల్సిన అన్ని స‌దుపాయాలు వారి వ‌ద్ద‌కే స‌మ‌కూరుస్తామ‌ని చెప్పారు. వాళ్లంద‌రికీ వారివారి ఇళ్ల‌లోనే స్క్రీనింగ్ నిర్వ‌హించిన అనంత‌రం వారికి ఎన్ని రోజుల క్వారంటైన్ అన్న‌ది చెబుతామ‌న్నారు. ఈ మేర‌కు స్థానిక కార్పోరేట‌ర్ కూడా అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌ని  కోరారు.  రోనా అంటే క‌ర్ఫ్యూ కాద‌ని, అది వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు మాత్ర‌మేన‌ని ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.