దేశంలో కరోన విలయ తాండవం.. 12 లక్షలకు చేరువలో కేసులు..

| Edited By:

Jul 22, 2020 | 11:34 AM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. ఇప్పటికే పదకొండు లక్షలు దాటిన కేసుల సంఖ్య.. పన్నెండు లక్షలకు చేరువైంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా..

దేశంలో కరోన విలయ తాండవం.. 12 లక్షలకు చేరువలో కేసులు..
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. ఇప్పటికే పదకొండు లక్షలు దాటిన కేసుల సంఖ్య.. పన్నెండు లక్షలకు చేరువైంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 37,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కి చేరింది. ఇక వీటిలో ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని 7,53,050 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,11,133 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 648 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 28,732 మంది మరణించారు.

కాగా, మంగళవారం నాటికి దేశ వ్యాప్తంగా 1,47,24,546 కరోనా టెస్టులు చేపట్టినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ తెలిపింది. కేవలం మంగళవారం నాడు ఒక్కరోజే 3,43,243 కరోనా టెస్టులు చేపట్టామని అధికారులు తెలిపారు.