కరోనా ఎఫెక్ట్: ‘సింగరేణి’లో ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలు

|

Jul 22, 2020 | 12:07 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి ఇప్పుడు జిల్లాలకు విస్తరిస్తోంది. మొన్నటి వరకు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు బయటపడ్డాయి. కానీ, ఇప్పుడు జిల్లాలాకు పాకిపోయిన కరోనా సింగరేణిలోనూ కలకలం రేపుతోంది.

కరోనా ఎఫెక్ట్: ‘సింగరేణి’లో ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలు
Follow us on

తెలంగాణలో కరోనా మహమ్మారి ఇప్పుడు జిల్లాలకు విస్తరిస్తోంది. మొన్నటి వరకు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు బయటపడ్డాయి. కానీ, ఇప్పుడు జిల్లాలాకు పాకిపోయిన కరోనా సింగరేణిలోనూ కలకలం రేపుతోంది. సింగరేణి ఏరియాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. దీంతో కార్మికుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. కరోనా భయంతో సింగరేణి కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి గనుల ప్రాంతాల్లో ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ సంచాలకుడు చంద్రశేఖర్ తెలిపారు.

సింగరేణి ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బందిని 24 గంటల పాటు అందుబాటులో ఉంచి రోగులకు ఖరీదైన మందులు అందిస్తామని వివరించారు. కోవిడ్ తీవ్రమైన రోగులకు మెరుగైన చికిత్సను అందించడానికి హైదరాబాద్‌లోని 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నామన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న గనులను కొన్ని రోజులు మూసివేస్తామని చెప్పారు. గనుల ప్రాంతాల్లో 2 నెలల పాటు కార్మిక సంఘాల సమావేశాలను అనుమతించబోమని స్సష్టషం చేశారు.