SPB Health Condition: కరోనా బారినపడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.ఆయనకు వెంటిలేటర్, ఎక్మో సాయంతోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఎస్పీబీ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా చేస్తున్నామని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)
అటు ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కూడా స్పందిస్తూ.. ”నాన్న ఆరోగ్యం రోజురోజుకూ మెరుగవుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త కోలుకున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు. నాన్న కోసం ప్రార్ధిస్తున్న అందరికీ కృతజ్ఞతలు” అని వీడియో సందేశంలో తెలిపారు.