ప్రధాని మోదీపై సోనియా ఫైర్..

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శనాస్త్రాలను సంధించారు. నిరుపేదల ఆకలి కేకలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించటం లేదా…? అని ప్రశ్నించారు. నిరుపేద‌లు, చిరు వ్యాపారులు, వ‌ల‌స కూలీల స‌హాయార్థం ఏర్పాటు చేసిన ‘స్పీక్ అప్ ఇండియా’ క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో గురువారం (28మే) సోనియా ముచ్చ‌టించారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులపై కేంద్రానికి ఏ మాత్రం పట్టింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌తి పేద కుటుంబానికి […]

ప్రధాని మోదీపై సోనియా ఫైర్..

Updated on: May 28, 2020 | 2:46 PM

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శనాస్త్రాలను సంధించారు. నిరుపేదల ఆకలి కేకలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించటం లేదా…? అని ప్రశ్నించారు. నిరుపేద‌లు, చిరు వ్యాపారులు, వ‌ల‌స కూలీల స‌హాయార్థం ఏర్పాటు చేసిన ‘స్పీక్ అప్ ఇండియా’ క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో గురువారం (28మే) సోనియా ముచ్చ‌టించారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులపై కేంద్రానికి ఏ మాత్రం పట్టింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌తి పేద కుటుంబానికి తక్ష‌ణ స‌హాయం కింద 10 వేల రూపాయలను అందివ్వాల‌ని , రాబోయే ఆరు నెలలపాటు దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ. 7,500ల చొప్పున వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.