ఇదేం సోషల్ డిస్టెన్సింగ్ ? చెన్నైలో సీఎం ప్రెస్ మీట్ వెన్యూ వద్ద ఇదీ సీన్ !

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 4:52 PM

చెన్నైలో శనివారం సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.పళనిస్వామి నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్ ను కవర్ చేయడానికి వఛ్చిన జర్నలిస్టులు, రిపోర్టర్లు, కెమెరామెన్లు పొలోమంటూ ఒకరినొకరు తోసుకున్నంత పని చేశారు.

ఇదేం సోషల్ డిస్టెన్సింగ్ ? చెన్నైలో సీఎం ప్రెస్ మీట్ వెన్యూ వద్ద ఇదీ సీన్ !
Follow us on

కరోనా వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ను ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఒక చోట గుమికూడకుండా సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని సూచించారు. కానీ తమిళనాడులో ఆ ఛాయలేవీ కనబడడం లేదు. చెన్నైలో శనివారం సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.పళనిస్వామి నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్ ను కవర్ చేయడానికి వఛ్చిన జర్నలిస్టులు, రిపోర్టర్లు, కెమెరామెన్లు పొలోమంటూ ఒకరినొకరు తోసుకున్నంత పని చేశారు. కరోనా వైరస్ కంట్రోల్ రూమ్ బయటే గుంపులు, గుంపులుగా చేరారు వీళ్లంతా.. వీరిలో కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఇక సీనియర్ ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సైతం ముఖ్యమంత్రిని చుట్టి ఉండడం కనిపించింది. అయితే తాము కరోనా నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పళనిస్వామి ఫోన్ లో ప్రధాని మోదీకి తెలిపారు. తమిళనాడులో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మదురైలో మరణించారు. కాగా-ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. షాపులు, కూరగాయల మార్కెట్లు, పెట్రోలు బంకులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు తెరచి ఉంచుతారు. జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటలవరకు, తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలవరకు తమ సేవలను అందించవచ్చు.